అక్షరటుడే, వెబ్డెస్క్: Tejaswi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సంచలన ప్రకటన చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి (government employe) ఉండేలా చూస్తామని ప్రకటించారు.
పాట్నాలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ఉపాధి హామీనిచ్చే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. అధికారం చేపట్టిన 20 నెలల్లోపు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం (government job) ఉన్న వ్యక్తి ఉండేలా చూస్తాము. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు దాని కోసం కొత్త చట్టం రూపొందిస్తాము. 20 నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లేని ఒక్క ఇల్లు కూడా ఉండదు” అని యాదవ్ తెలిపారు.
Tejaswi Yadav | ‘జుమ్లా’ కాదని హామీ ఇస్తున్నా: తేజస్వి
తన వాగ్దానం అబద్ధమో, మోసపూరితమో కాదని బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) ప్రతిపక్ష నాయకుడు తేజస్వి తెలిపారు. తాను డేటా ఆధారంగానే ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. ఇది నా ప్రతిజ్ఞ. ఇది చేయవచ్చు. ఇది జుమ్లే బాజీ కాదు” అని ఆయన అన్నారు. ఈసారి బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. “సామాజిక న్యాయంతో పాటు బీహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం జరిగేలా మేము చేస్తాం. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమే. అయితే దీనికి కావాల్సింది సంకల్పం మాత్రమేరం. వారు (ఎన్డీయే) మా ప్రకటనలను కాపీ చేశారు” అని తేజస్వి తెలిపారు.
Tejaswi Yadav | వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు..
నవంబర్ నెలలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly elections) ముందు తేజస్వి నుంచి ఈ సంచలన ప్రకటన వెలువడింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం చేసినట్లుగా బీహార్ ప్రజలకు “నిరుద్యోగ భత్యం” ఇవ్వడం కంటే వారికి ఉపాధి కల్పించడమే తమ ప్రాధాన్యత అని తేజస్వి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను చేయబోయే అనేక ప్రకటనలలో ఇది మొదటిదని చెప్పారు. ఈ ఏడాది జూన్ 24 నాటికి 7.89 కోట్ల మంది ఓటర్లతో పోలిస్తే, తుది ఓటర్ల జాబితాలో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ముసాయిదా జాబితా నుండి 65 లక్షల మంది ఓటర్లను తొలగించారని, ఆగస్టు 1, 2025 నాటికి ముసాయిదా జాబితాలోని ఓటర్ల సంఖ్య 7.24 కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు.