అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shabbir Ali | పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులను (Shaadi Mubarak cheques) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. 481 లబ్ధిదారులకు రూ. 4.81 కోట్ల షాదీ ముబారక్, 187 లబ్ధిదారులకు 1.87 కోట్ల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు. రూ. 500కు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, సన్న బియ్యం పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.