అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Noida Airport | ప్రభుత్వ పనులు దక్కించుకున్న కంపెనీలు ఆయా పనులను చాలా సందర్భాల్లో నిర్ణీత గడువులోగా పూర్తిచేయవు. దీంతో ప్రభుత్వాలు కంపెనీలకు గడువు పెంచుతాయి. పనుల్లో వేగం పెంచాలని ఆదేశిస్తాయి. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం UP Govt పనుల్లో జాప్యం చేసినందుకు సదరు కంపెనీకి రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధిస్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం Noida Airport పనులను టాటా tata ప్రాజెక్ట్ కంపెనీ దక్కించుకుంది. అయితే పనులు సెప్టెంబర్ 2024 వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా జాప్యం జరిగిందని కంపెనీ చెప్పడంతో మరో మూడు నెలలు ప్రభుత్వం గడువు పెంచింది. డిసెంబర్‌లోపు కూడా పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్‌లోపు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కంపెనీ ఏప్రిల్ వరకు కూడా ఎయిర్పోర్ట్ పనులు పూర్తిచేయలేదు.
Noida Airport | సీఎం యోగి ఆగ్రహం
నోయిడా ఎయిర్పోర్ట్ పనులను గడువులోగా పూర్తి చేయకపోవడంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ UP CM Yogi ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీకి జనవరి 1 నుంచి పనులు పూర్తయ్యే వరకే రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ కంపెనీ రోజు రెండు వేల మంది వర్కర్స్‌ను అదనంగా నియమించుకొని పనులు వేగవంతంగా చేపడుతోంది. జూన్ 30 వరకు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.