Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట: పోచారం

MLA Pocharam | వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట: పోచారం

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : MLA Pocharam | గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రూ. 1.43 కోట్లతో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ సురేశ్​ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan)తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్​సీలో అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి సేవలు, సాధారణ చికిత్సలు, ప్రయోగశాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజారోగ్య రంగం బలోపేతం దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Center) ద్వారా స్థానికులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.