ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Job Notification | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    Job Notification | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Job Notification | రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ(Health Department)లో పలు ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా మెడికల్ అండ్ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల(Assistant Professor Post) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 732 ఫార్మసిస్ట్‌, 1,931 మల్టీపర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

    Job Notification | జూలై 17లోగా దరఖాస్తు చేసుకోవాలి

    ప్రభుత్వం తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 10 నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 17 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల ఎడిట్​ ఆప్షన్​ జులై 18, 19 తేదీల్లో కల్పిస్తారు. మొత్తం 607 పోస్టులను భర్తీ చేయనుండగా.. మల్టీ జోన్​–1 పరిధిలో 379 పోస్టులు, మల్టీ జోన్​–2 పరిధిలో 228 పోస్టులు ఉన్నాయి. మొత్తం 34 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వేర్వేరుగా ఆన్​లైన్​లో అప్లై చేయాల్సి ఉంటుంది.

    Job Notification | అర్హతలు.. ఎంపిక

    సంబంధిత కోర్సుల్లో పీజీ(PG), సూపర్​ స్పెషాలిటీ కోర్సులు(Super Specialty Courses) చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 46 ఏళ్లలోపు ఉండాలి. పలు విభాగాల వారికి వయసు మినహాయింపు ఉంది. రూ.500 అప్లికేషన్​ ఫీజు, రూ.200 ప్రాసెసింగ్​ ఫీజు చెల్లించాలి. తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే అప్లికేషన్​ ఫీజు రూ.500 మాత్రం చెల్లించాలి. మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఉద్యోగం సాధిస్తే రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు (యూజీసీ పే స్కేల్​) వేతనం పొందవచ్చు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...