అక్షరటుడే, వెబ్డెస్క్: New Ration Cards | ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చేస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొంతకాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వారిలో అర్హులకు ఈ నెల 14న కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
New Ration Cards | జనవరి 26న ప్రారంభం
కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జనవరి 26న కొత్త రేషన్ కార్డుల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. కుల గణన సందర్భంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అంతేగాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకున్నారు. దీంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్నారు.
New Ration Cards | అర్హుల ఎంపికలో జాప్యం
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే చాలా మంది అర్హత లేకున్నా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దరఖాస్తులను వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిసిందే. ఇప్పటికే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల యాడింగ్ ప్రక్రియ పూర్తయింది. వారి రెండు నెలలుగా బియ్యం కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. తుంగతుర్తిలో సీఎం రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. కాగా.. రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం.
New Ration Cards | స్థానిక ఎన్నికల కోసమేనా..
రాష్ట్రంలో సెస్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే తొమ్మిది రోజుల్లో రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) జమ చేసింది. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసి బిల్లులు మంజూరు చేస్తోంది. తాజాగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనుంది. దీంతో స్థానిక ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందని పలువురు భావిస్తున్నారు.