ePaper
More
    HomeతెలంగాణMinister seethakka | దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త

    Minister seethakka | దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister seethakka | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం telangana govt గుడ్​న్యూస్​ చెప్పింది. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం Marriage encouragement ఎప్పటి నుంచో అమలులో ఉంది. వివాహం చేసుకున్న జంటలో ఎవరో ఒకరు దివ్యాంగులు అయితే ప్రభుత్వం ప్రోత్సాహం అందజేసింది. ప్రస్తుతం ఈ పథకం రూ.లక్ష నగదు అందిస్తున్నారు. అయితే దంపతుల్లో ఎవరో ఒకరు దివ్యాంగులు అయితే మాత్రమే ఈ పథకం వర్తించేది.

    ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహకం అందేది కాదు. దీనిపై కొన్నేళ్లుగా దివ్యాంగులు పోరాడుతున్నారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్న ప్రోత్సాహకం అందించాలని కోరుతున్నారు. ఎట్టకేలకు మంత్రి సీతక్క minister Seethakka చొరవతో వారి వినతికి మోక్షం లభించింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న రూ.లక్ష ప్రోత్సాహక నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ anitha ramachandran​ ఉత్తర్వులు జారీ చేశారు.

    More like this

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....