HomeUncategorizedMedical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. భారీగా స్టైఫండ్​ పెంపు

Medical Students | మెడికోలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. భారీగా స్టైఫండ్​ పెంపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Students | రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. వారి స్టైఫండ్ (stipend)​ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకే సారి 15శాతం స్టైఫండ్​ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్ (Medical), డెంటల్ (Dental) స్టూడెంట్స్‌తో పాటు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ. 29,792, పీజీ డాక్టర్ల (PG Doctors)కు ఫస్ట్ ఇయర్‌లో రూ. 67,032, సెకండ్ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్​ అందనుంది.

కాగా.. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30 నుంచి ఆందోళన చేపడతామని జూనియర్​ డాక్టర్ల అసోసియేషన్​ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టైఫండ్​ చెల్లింపులో జాప్యం, మౌలిక వసతులు కల్పించకపోవడం, స్టైఫండ్ పెంపు వంటి అంశాలపై వారు డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఏకంగా 15 శాతం స్టైఫండ్​ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Must Read
Related News