Farmers | రైతులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | తెలంగాణ ప్రభుత్వం telangana govt రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వారికి బోనస్ డబ్బులు వెంటనే జమ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి minister uttam kumar reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సూచించారు. కాంటా అయిన ధాన్యం బస్తాలు మిల్లుల్లో అన్​లోడింగ్​ చేయగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | తెలంగాణ ప్రభుత్వం telangana govt రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వారికి బోనస్ డబ్బులు వెంటనే జమ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి minister uttam kumar reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సూచించారు. కాంటా అయిన ధాన్యం బస్తాలు మిల్లుల్లో అన్​లోడింగ్​ చేయగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాకుండా సన్నరకం ధాన్యం సాగు చేసిన అన్నదాతలకు బోనస్​ డబ్బులు కూడా వెనువెంటనే జమ చేయాలన్నారు.

ప్రభుత్వ సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇస్తోంది. దీంతో యాసంగి సీజన్​లో చాలా మంది రైతులు సన్నాలనే సాగు చేశారు. వారు ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయిస్తున్నారు. అయితే తొలుత మద్దత ధర మాత్రమే చెల్లిస్తున్న ప్రభుత్వం, తర్వాత రైతుల ఖాతాల్లో బోనస్​ డబ్బులు జమ చేస్తోంది.

Related articles

ex-railway-minister mukul roy | విషాదం.. గుండెపోటుతో రైల్వే మాజీ మంత్రి కన్నుమూత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71)...

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి....

Nepal accident | నేపాల్​లో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nepal accident | నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా Dhading district గజురి Gajuri సమీపంలోని త్రిశూలి నది Trishuli river లో...

Feb 23 Pre Market Analysis | లాభాల్లో గ్లోబల్ క్యూస్.. భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 23 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాల బాటలో సాగుతోంది. ఈ...