- Advertisement -
HomeతెలంగాణMLA Prashanth Reddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం

MLA Prashanth Reddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: MLA Prashanth Reddy | కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి (Balkonda MLA Prashanth Reddy) అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులు సైతం నైరాశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు. భీమ్​గల్‌ మండల (Bheemgal mandal) కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకుడు మహ్మద్‌ ఇక్రం తిరిగి సొంత గూటికి చేరారు.

హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో పార్టీ మారిన వారంతా తిరిగి బీఆర్‌ఎస్‌లో (BRS Party) చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఆ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ భగత్‌, మాజీ ఎంపీటీసీలు సుర్జీల్‌, రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News