అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీజెడ్సీ పూర్తి చేసిన విద్యార్థిని నిఖిత ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో (CPGET) రాష్ట్రస్థాయి 7వ ర్యాంక్‌ను దక్కించుకుంది.
వృక్షశాస్త్రం (బోటనీ) విభాగంలో (Botany department) విద్యార్థిని ఈ ఘనతను సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కొర్రి అశోక్, వృక్షశాస్త్ర విభాగాధిపతి రఘునాథ్, అధ్యాపకులు రమేష్, సచిన్ తదితరులు నిఖితను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. నిఖిత సాధించిన ర్యాంక్ కళాశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పోటీపరీక్షల్లో విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.