అక్షరటుడే, వెబ్‌డెస్క్:Union Government | అశ్లీష కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ఓటీటీ(OTT)లు, వెబ్‌సైట్ల(Websites)పై కేంద్రం కొరడా ఝళిపించింది. 25 ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్‌లకు పబ్లిక్ యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(Internet Service Provider)లను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో అశ్లీల వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కంటెంట్ ఉల్లంఘనల కారణంగా ULLU, Big Shots యాప్, ALTT, Desiflix వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను తొలగించారు.
Union Government | అభ్యంతరకరమైన కంటెంట్..
ఆయా ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్లు అభ్యంతరకరమైన ప్రకటనలు, అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నాయని కేంద్రం గుర్తించింది. అనేక భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న ఈ యాప్‌లు, వెబ్‌సైట్‌లకు యాక్సెస్‌ను భారత భౌగోళిక ప్రాంతంలో పరిమితం చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. నిషేధించిన OTT యాప్‌ల జాబితాలో Adda TV, ALTT, Big Shots యాప్, Boomex, Bull యాప్, Desiflix, Feneo, Fugi, Gulab యాప్, Hitprime, HotX VIP, Hulchul యాప్, Jalva యాప్, Kangan యాప్, Look Entertainment, Mojflix, MoodX, Navarasa Lite, NeonX VIP, ShowHit, ShowX, Sol Talkies, Triflicks, ULLU, Wow Entertainment ఉన్నాయి.
Union Government | కంటెంట్‌ను తొలగించాల్సిందే..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67, 67A, భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 294 , మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం 1986లోని సెక్షన్ 4 ప్రకారం ఆయా యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని, మహిళల అసభ్య ప్రాతినిధ్యాన్ని ఈ చట్టాలు నిషేధించాయి. నోటిఫై చేసిన ఆయా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తీసివేయడంలో లేదా నిలిపి వేయడంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు విఫలమైతే ప్రభుత్వం(Central Government) సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3)(b) ప్రకారం వారిపైనా చర్యలు చేపట్టే అవకాశముంది.