Homeఆంధప్రదేశ్Srikakulam stampede | తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం.. అండగా ఉంటామన్న ప్రభుత్వం

Srikakulam stampede | తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం.. అండగా ఉంటామన్న ప్రభుత్వం

శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి రామ్మోహన్​నాయుడు పరామర్శించి చెక్కులు అందించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srikakulam stampede | శ్రీకాకుళం కాశీబుగ్గ (Kasibugga) వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట చోటు చేసుకొని 9 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) ఇప్పటికే విచారణకు ఆదేశించింది. తాజాగా బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఏకదశి సందర్భంగా శనివారం దాదాపు 20 వేల మంది భక్తులు వచ్చారు. అయితే ఆలయ సామర్థ్యం 2 వేల నుంచి 3 వేల మంది మాత్రమే. దీంతో రద్దీ అధికంగా ఉండటంతో మొదటి అంతస్తులోకి వెళ్లే మెట్ల మార్గంలో గ్రిల్స్​ ఊడిపోయి భక్తులు కింద పడ్డారు. ఈ ఘటనలో 8 మహిళలు, ఓ బాలుడు చనిపోయాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Srikakulam stampede | రూ.15 లక్షల చొప్పున..

తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం (Compensation) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu), రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులు అందజేశారు. మృతుల కుటుంబాలకు అండగా వారు భరోసా ఇచ్చారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వైసీపీ సైతం రూ.2లక్షల పరిహారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.