ePaper
More
    HomeతెలంగాణIVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎఫ్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎఫ్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) అప్రమత్తమైంది. ఇటీవల సికింద్రాబాద్​లోని సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​పై (Srishti Test Tube Center) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

    ఐవీఎఫ్​, సరోగసీ పేరిట పేరిట మోసాలు చేస్తుండడంతో డాక్టర్​ నమ్రతతో (Dr. Namrata) పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐవీఎఫ్​ సెంటర్లపై తనిఖీలు చేయాలని ఆదేశించింది.

    IVF Centers | 35 బృందాలతో తనిఖీలు

    రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్​ సెంటర్లపై (IVF Centers) వైద్యారోగ్య శాఖ అధికారులు దాడులు చేయనున్నారు. దీని కోసం 35 బృందాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ బృందాలు తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. మొదట హైదరాబాద్​ నగరంలో సోదాలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లాల్లో దాడులు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 381 IVF సెంటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్​ నగరంలోనే 157 ఉన్నాయి. తనిఖీల కోసం 29 అంశాలతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు (Health Department Officers) లిస్ట్​ రెడీ చేశారు.

    READ ALSO  Harish Rao | నెల రోజులైనా ప‌రిహారం రాలే.. సిగాచి బాధితుల‌ను ఆదుకోవాల‌న్న హ‌రీశ్‌రావు

    IVF Centers | కొనసాగుతున్న దర్యాప్తు

    ‘సృష్టి’ కేసులో ఇప్పటికే పోలీసులు ప్రధాన నిందితురాలు డాక్టర్​ నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం రెండో రోజును ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులు కల్యాణి, సంతోషిని సైతం శనివారం కస్టడీకి తీసుకున్నారు. గోపాలపురం పోలీస్​ స్టేషన్​లో (Gopalapuram Police Station)​ నిందితులను విచారిస్తున్నారు. ఎంత మంది పిల్లలను తీసుకువచ్చి దంపతులకు సరోగసి పేరిట అప్పగించారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

    Latest articles

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    More like this