అక్షరటుడే నిజామాబాద్ సిటీ: TNGOS Nizamabad | టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా శాఖ క్యాలెండర్–2026ను ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో క్యాలెండర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని (MLA Sudarshan Reddy) ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా బదిలీపై వచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని, టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, జాఫర్ హుస్సేన్, శివకుమార్, జాకీర్ హుస్సేన్, మారుతి, భీమ్గల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, ఆర్మూర్ యూనిట్ కార్యదర్శి విశాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు మహేందర్, ప్రకాష్, పార్థసారథి, లక్ష్మీనారాయణ, విశాల్ రెడ్డి, విజయలక్ష్మి, మంగమ్మ, స్వామి, సునీల్, టీఎన్జీవోస్ సలహాదారులు వనమాల సుధాకర్, క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేరేళ్ల శ్రీనివాస్, సర్దార్ బీరేందర్ సింగ్, వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు.