Homeతాజావార్తలుMLA Sudarshan Reddy | సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి

MLA Sudarshan Reddy | సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు సుదర్శన్​రెడ్డి సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్​ నేతలు ఉన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Sudarshan Reddy | ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి శనివారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రభుత్వం సుదర్శన్​రెడ్డి(MLA Sudarshan Reddy)ని ఇటీవల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సుదర్శన్​రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​(Mahesh Kumar Goud), జిల్లాకు చెందిన నాయకులు తాహెర్​ బిన్​ హందాన్​, మానాల మోహన్​రెడ్డి, ఈరవత్రి అనిల్​, ముత్యాల సునీల్​రెడ్డి, నగేశ్​రెడ్డి, కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News