అక్షరటుడే, ఇందూరు: Government Advisor Sudarshan Reddy | రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని (MLA Sudarshan Reddy) ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించాయి. తొలిసారి కలెక్టరేట్‌కు (Collectorate) వచ్చిన ఆయనను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు. పూలమొక్కలు అందించి శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ (Revenue Department) ద్వారా ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు.
అనంతరం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో.. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రశాంత్, శ్రీనివాస్, ప్రభు, సతీష్ పాల్గొన్నారు. అనంతరం రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
