More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు దేవాదాయ ధర్మదాయ శాఖ(Endowment and Charitable Endowments Department) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Bomma Mahesh Kumar Goud), నుడా ఛైర్మన్​ కేశ వేణు(Nuda Chairman Kesha Venu) సూచించిన వారికే పాలక మండళ్లలో పదవులు దక్కాయని తెలుస్తోంది.

    కాగా, పాలక మండళ్ల ఛైర్మన్​, డైరెక్టర్ పదవులను ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి దక్కినట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

    Nizamabad : శంభుని గుడి ఆలయ కమిటీ ఛైర్మన్​గా..

    నిజామాబాద్ జిల్లా(Nizamabad district) కేంద్రంలోని స్వయంభూ గా వెలిసిన శంభూలింగేశ్వర ఆలయాని(Shambhulingeswara temple)కి నూతన కమిటీని నియమించారు. కమిటీ ఛైర్మన్​గా పూసల మధు అలియాస్ బింగి మధు నియామకమయ్యారు. డైరెక్టర్​లుగా గాజుల కిషోర్, కమల్ కిషోర్ దయామా, గాండ్ల సంతోష్ కుమార్, మామిడి శేఖర్, గోపు రేఖ అలియాస్ ఎర్రం రేఖ, ఉప్పల రమేష్​ నియమితులయ్యారు.

    Nizamabad : జెండా బాలాజీ ఆలయానికి..

    నగరంలోని జండాగల్లిలో ప్రసిద్ధ జెండా బాలాజీ ఆలయాని(Jenda Balaji Temple)కి కొత్త కమిటీ ఏర్పడింది. ఛైర్మన్​గా లవంగ ప్రమోద్ నియమితులయ్యారు. ధర్మకర్తలుగా సిరిపురం కిరణ్ కుమార్, పోలకొండ నర్సింగ్ రావు, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్​, కోర్వ రాజ్ కుమార్, పవార్ విజయ ఎంపికయ్యారు.

    Nizamabad : హమాల్​వాడీలోని…

    నగరంలోని హమాల్​వాడీ(Hamalwadi)లోని సంతోషీమాత(Santoshi Mata), సాయిబాబా ఆలయాల(Sai Baba temples)కు కూడా నూతన కమిటీలు వచ్చాయి. ఛైర్మన్​గా బోదుకం గంగా కిషన్ నియమితులయ్యారు. డైరెక్టర్​లుగా శ్రీరాం శ్రీనివాస్, బాణాల శివ లింగం, గాదే ప్రవీణ్ కుమార్, శాంతాబాయిని నియమించారు.

    Nizamabad : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..

    రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరులోగా లోకల్​బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆలయాల పాలక మండళ్లలో పదవులు దక్కనివారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

    More like this

    September 16 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 16 Panchangam | తేదీ (DATE) – సెప్టెంబరు 16,​ 2025 పంచాంగం (today horoscope) శ్రీ...

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...