HomeతెలంగాణYellareddy | స్వగ్రామానికి చేరుకున్న గోవర్ధన్ మృతదేహం

Yellareddy | స్వగ్రామానికి చేరుకున్న గోవర్ధన్ మృతదేహం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి:Yellareddy | మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి(Thimmareddy village) చెందిన గోవర్ధన్​(26) అమెరికా(America)లో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం స్వగ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్ల క్రితం గోవర్ధన్​ చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఎంఎస్​ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసేవాడు. గుండెపోటు(heart attack)తో హఠన్మారణం చెందాడు. గోవర్ధన్​ తండ్రి విఠల్​ ఎల్లారెడ్డి మార్కెట్​ కమిటీ మాజీ డైరెక్టర్​గా పనిచేశారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​ పరామర్శించారు. కుటుంబాన్ని ఓదార్చారు.

బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​