అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YSRCP Digital Book | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల అధికార కూటమి దాడులపై స్పందిస్తూ “ఇవాళ్టి మీ బాధ – రేపటి మన రివెంజ్” అంటూ ‘డిజిటల్ బుక్’ అనే ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేశారు.
ఇది పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న వేధింపులు, అరెస్టులు, అక్రమ దాడులపై ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. అయితే జగన్ ఆశించిన విధంగా ఈ డిజిటల్ బుక్ ముందుకు సాగడంలేదు. ఇది ప్రస్తుతం వైసీపీకి తలనొప్పిగా మారిన పరిస్థితి.
YSRCP Digital Book | సొంత నేతలపైనే కంప్లైంట్లు..!
డిజిటల్ బుక్(Digital Book)లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఎలాంటి అడ్డంకీ లేదు. ఇది ఓపెన్ ఫార్మాట్ కాబట్టి ప్రజలు, కార్యకర్తలు అందరూ వినియోగించుకోవచ్చు. అయితే ఆశించని కోణం ఏమిటంటే..ఇందులో వైసీపీ సొంత నాయకులపైనే ఫిర్యాదులు రావడం. ఇప్పటివరకు 32 ఫిర్యాదులు డిజిటల్ బుక్‌లో నమోదయ్యాయి, వీటిలో చాలా వాటిలో వైసీపీ నేతల పేర్లు ఉన్నాయని సమాచారం. ప్రత్యేకంగా చిలకలూరిపేట మాజీ మంత్రి విడదల రజినిపై వచ్చిన ఫిర్యాదు పెద్ద దుమారమే రేపుతోంది. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, “రజిని నా ఇంటిపై, కారు మీద దాడి చేయించారు. జగన్(YS Jagan) న్యాయం చేయాలి” అంటూ డిజిటల్ బుక్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలతో కూడిన ఆధారాలు కూడా అప్‌లోడ్ చేసినట్టు సమాచారం.
వైసీపీ డిజిటల్ బుక్‌ను తెచ్చింది తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్(Nara Lokesh) రూపొందించిన ‘రెడ్ బుక్’కు ప్రత్యామ్నాయంగా. రెడ్ బుక్‌లో తమ నాయకులను టార్గెట్ చేసిన అధికారుల, రాజకీయ ప్రత్యర్థుల పేర్లు నమోదు చేసి, అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ అందుకు రెస్పాన్స్‌గా డిజిటల్ బుక్‌ను తెచ్చారు. వాస్తవంగా ఇది అధికార పార్టీల వేధింపులపై పోరాటానికి ఉపయోగపడాలని భావించారు. కానీ అంతర్లీనంగా వైసీపీ నేతలకే ఇది సమస్యగా మారింది. డిజిటల్ బుక్‌లో కంప్లైంట్ నమోదు చేసిన తర్వాత రిసిప్ట్ జెనరేట్ అవుతోంది. దీనిని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “నేను ఫిర్యాదు చేశాను – మీరే పరిష్కరించండి” అనే విధంగా వైసీపీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ ట్రెండ్ వల్ల పార్టీపైనే అవిశ్వాసం చెలరేగుతున్నట్టుగా కనిపిస్తోంది.వైసీపీ నేతలు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అనే దానిపై ఆలోచనలో ఉన్నారు. ఒకవైపు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్న లక్ష్యం.. మరోవైపు అదే టూల్ ఇప్పుడు పార్టీకి తలనొప్పి అవ్వడమే కాక, ప్రజా విమర్శలకు దారితీస్తోంది.