అక్షరటుడే, వెబ్డెస్క్ : Secunderabad | సికింద్రాబాద్ (Secunderabad ) డివిజన్ డీఆర్ఎం(డివిజనల్ రైల్వే మేనేజర్)గా ఆర్ గోపాల కృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ (Hyderabad) డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM)గా సంతోష్ కుమార్ వర్మ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జీఎంగా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇటీవల నియమితులయ్యారు. తాజాగా జోన్ పరిధిలో ఇద్దరు డీఆర్ఎంలను నియమిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
