Homeటెక్నాలజీPasskey | పాస్‌వర్డ్‌ల యుగానికి వీడ్కోలు చెబుతున్న గూగుల్.. అల‌ర్ట్ జారీ

Passkey | పాస్‌వర్డ్‌ల యుగానికి వీడ్కోలు చెబుతున్న గూగుల్.. అల‌ర్ట్ జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Passkey | ఆన్‌లైన్ భ‌ద్రత ఇప్పుడు చాలా క్లిష్టంగా మారింది. ఈ క్ర‌మంలో పాత ప‌ద్ద‌తుల‌కి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని టెక్ దిగ్గ‌జం గూగుల్ Google చెబుతుంది.

ముఖ్యంగా జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వంటి కీలక ఖాతాల రక్షణకు, పాస్‌వర్డ్‌లు మరియు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) పద్ధతులకంటే మెరుగైన భద్రతను పాస్‌కీ(Passkey)లు అందిస్తాయ‌ని చెప్ప‌కొచ్చింది. ఈ సందర్బంగా.. గూగుల్ “మీరు పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవ‌ల్సిన‌ అవసరం లేదు, రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. భద్రతగా, సులభంగా లాగిన్ అయ్యే మార్గం ఇప్పుడు పాస్‌కీలు” అంటూ నూతన దిశను సూచించింది.

Passkey | గూగుల్ హెచ్చరిక

గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తృత వృద్ధితో పాటు సైబర్ నేరగాళ్ల తాకిడి కూడా పెరుగుతుండటాన్ని గూగుల్ గుర్తించింది. గూగుల్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. దాదాపు 61 శాతం ఈమెయిల్ యూజర్లు ఏదో ఒక రూపంలో ఫిషింగ్ దాడులకు గురవుతున్నారు. పాస్‌వర్డ్‌లు(Passwords) నాసిరకం భద్రతా పద్ధతులుగా మారిపోయాయని, అవి సులభంగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కంపెనీ హెచ్చరించింది. ఈ క్రమంలో పాస్‌కీలు బెట‌ర్ అంటుంది.

పాస్‌కీలు (Passkeys) అనేవి పాస్‌వర్డ్‌లకు ఆధునిక ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన భద్రతా విధానం. ఇవి బయోమెట్రిక్ గుర్తింపు (వేలిముద్రలు, ముఖ గుర్తింపు), లేదా పిన్/ప్యాటర్న్‌ల ఆధారంగా యూజర్‌ను గుర్తించి ఖాతాలోకి ప్రవేశం ఇవ్వగలవు. ఇవి ఫిషింగ్ దాడులకు అలాగే మిడిల్-మ్యాన్ హ్యాకింగ్‌లకు అంతంచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాస్‌కీలు ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్ (Smart Phone), ల్యాప్ టాప్ లకు అవసరం. ఉపయోగించే పరికరానికి మాత్రమే పాస్‌కీ సేవ్ అవుతుంది. దీని వలన యూజర్ డేటా అనధికారుల చేతికి చిక్కే అవకాశం తక్కువగా ఉంటుంది. గూగుల్ పరిశోధనల ప్రకారం, జెనరేషన్ Z (యువతరం) ఇప్పటికే పాస్‌కీలు మరియు ‘సైన్ ఇన్ విత్ గూగుల్’ వంటి పద్ధతుల వైపు మొగ్గుచూపుతోంది. కానీ పాత తరం వినియోగదారులు ఇంకా సంప్రదాయ పాస్‌వర్డ్ పద్ధతులను వదిలిపెట్టడానికి సిధ్ధంగా లేరని తేలింది.

మే 1 – ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవం సందర్భంగా, గూగుల్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా “మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోవడానికి బదులుగా, పాస్‌కీతో భద్రతగా సైన్ ఇన్ అవ్వండి” అంటూ వినియోగదారులకు సూచించింది. ఇది భవిష్యత్ డిజిటల్ భద్రతా మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ Instagram అధినేత ఆడమ్ మోసెరీ ఒక ఫిషింగ్ దాడి నుండి తృటిలో తప్పించుకున్నట్లు స్వయంగా వెల్లడించడం గూగుల్ చేసిన హెచ్చరికకు మరింత బలం చేకూర్చుతోంది.