అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Google Pixel 10a | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ అయిన గూగుల్.. మిడ్ రేంజ్‌లో 5జీ స్మార్ట్ ఫోన్‌ను (Smart Phone) లాంచ్ చేయబోతోంది. టెన్సర్ జీ4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 (Android 16) వంటి ఫీచర్లతో తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిని గతేడాది విడుదలైన గూగుల్ పిక్సెల్ 9ఏకు అడ్వాన్స్‌డ్ వర్షన్‌గా భావిస్తున్నారు. సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ గూగుల్ పిక్సెల్ 10ఏకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫీచర్స్ (Features) గురించి తెలుసుకుందామా..
డిస్‌ప్లే : 6.36 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో (Display) తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, 2424 * 1080 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో రానుంది. హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ : గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ఉపయోగించనున్నారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేయనుంది. ఏడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి.
కెమెరా : వెనకవైపు 48 మెగా పిక్సెల్(MP) మెయిన్ కెమెరాతో పాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్(Dual camera setup) ఉండనుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
బ్యాటరీ : 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఇది 20w ఫాస్ట్ చార్జింగ్, 7.5w వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : 8 జీబీ(GB) ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 49,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 53,999.
