అక్షరటుడే, వెబ్‌డెస్క్ : google pixel 10 pro | కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా, మంచి ఫీచర్స్‌తో (good features) మీకు నచ్చిన విధంగా ఉండే ఫోన్ త్వరలో మీ ముందుకు రాబోతుంది. అది మరేదో కాదు గూగుల్ నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 10 సిరీస్ (google Pixel 10 Pro). దీనిని త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఆగస్ట్ 2025లో దీనిని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన లీక్‌లు, పుకార్లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లైనప్‌లో గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉండవచ్చు. డిస్‌ప్లే (phone display), ఆకట్టుకునే కెమెరా (attractive camers), ఇతర ఫీచర్లలో PWM డిమ్మింగ్‌ను లైనప్ పొందుతుందని పుకారు ఉంది.
google pixel 10 pro | మంచి ఫీచర్స్ తో..
గూగుల్ పిక్సెల్ 10 ప్రో డిజైన్ (googel pixel 10 pro design) అంచనా ప్రకారం ఇది మోడల్ పిక్సెల్ 9 ప్రో మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. ఫ్లాట్ ఎడ్జ్‌లు, సిమెట్రిక్ బెజెల్స్, పంచ్-హోల్ ఫ్రంట్ కెమెరాను (front camera) పొందే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ ఐకానిక్ రియర్ కెమెరా వైజర్‌ను (iconic rear camera visor) ఉంచవచ్చు. అయితే, మ్యాట్ ఫినిషింగ్ బదులుగా ఆకర్షణీయమైన ఫ్రేమ్‌ను పొందవచ్చు. పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు అంచనా ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ LTPO డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుందని అంచనా.
గీతలు, మరకలు పడకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ (gorilla glass victous 2 protection) కూడా పొందవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం గూగుల్ TSMC 3 nm-ఆధారిత కొత్త టెన్సర్ G5 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్ (primery sensore 50mp camera), 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, బ్యాక్ ప్యానెల్‌లో 48MP అల్ట్రావైడ్ కెమెరాను (back panel 48mp ultra wide camera) పొందవచ్చు. అదనంగా, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ కావచ్చు. కొన్ని అడ్వాన్స్ ఏఐ ఫీచర్లు, జెమిని ఇంటిగ్రేషన్‌ను (advance AI features and gemini integration feature) కూడా చూడవచ్చు. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధరపై పిక్సెల్ 9 ప్రో ధరతో సమానంగా ఉండవచ్చని సూచించాయి. పిక్సెల్ 9 ప్రో భారత మార్కెట్లో (indian markets) బేస్ వేరియంట్ కోసం దాదాపు రూ. 1,09,999 ఉన్నట్టు తెలుస్తోంది.