Homeబిజినెస్​Diwali Offer | దీపావళి స్పెషల్: గూగుల్ వన్ స్టోరేజీ ప్లాన్లపై భారీ ఆఫర్.. కేవలం...

Diwali Offer | దీపావళి స్పెషల్: గూగుల్ వన్ స్టోరేజీ ప్లాన్లపై భారీ ఆఫర్.. కేవలం రూ.11కే ప్రీమియం సర్వీస్!

దీపావళి పండుగ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ వన్‌ స్టోరేజీ సేవలపై ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా, కేవలం రూ.11కే 2టీబీ వరకు క్లౌడ్ స్టోరేజీ ని వినియోగించుకునే అవకాశం కల్పించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diwali Offer | దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థలు వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా భారీ ఆఫర్‌ను అందిస్తోంది.

గూగుల్ వన్ (Google One) క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్లపై కేవలం రూ.11కే లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను పొందే అవకాశాన్ని కల్పించింది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆఫర్‌లో భాగంగా గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి సేవల్లో అదనపు క్లౌడ్ స్టోరేజీని (Cloud Storage) మూడు నెలల పాటు తక్కువ ధరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ సాధారణ రేట్లు అమలులోకి వస్తాయి. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Diwali Offer | నెలవారీ ప్లాన్లు..

  • లైట్ ప్లాన్ (30GB) – సాధారణ ధర రూ.30, ఇప్పుడు కేవలం రూ.11
  • బేసిక్ ప్లాన్ (100GB) – సాధారణ ధర రూ.130, ఆఫర్‌లో రూ.11
  • స్టాండర్డ్ ప్లాన్ (200GB) – సాధారణ ధర రూ.210, ఆఫర్ ధర రూ.11
  • ప్రీమియం ప్లాన్ (2TB) – సాధారణ ధర రూ.650, ఇప్పుడు రూ.11 కే మూడు నెలల పాటు

Diwali Offer |వార్షిక ప్లాన్లు:

గూగుల్ వార్షిక ప్లాన్లపైనా డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు 37 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

  • లైట్ ప్లాన్ (30GB) – రూ.708 బదులుగా రూ.479
  • బేసిక్ ప్లాన్ (100GB) – రూ.1560 బదులుగా రూ.1000
  • స్టాండర్డ్ ప్లాన్ (200GB) – రూ.2520 బదులుగా రూ.1600
  • ప్రీమియం ప్లాన్ (2TB) – రూ.7800 బదులుగా రూ.4900

దీపావళి పండుగ (Diwali Festival) సీజన్‌లో గూగుల్ వన్ ఆఫర్లు టెక్ ప్రియులకు మంచి గిఫ్ట్‌లా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ క్లౌడ్ స్టోరేజీని పొందే ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.