అక్షరటుడే, వెబ్‌డెస్క్: AI Music Tool | సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు సృజనాత్మక మార్పులు తీసుకొచ్చే గూగుల్ సంస్థ (Google company).. తాజాగా సంగీతాభిమానుల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ డీప్‌మైండ్ డెవలప్ చేసిన అత్యం శక్తివంతమైన మ్యూజిక్ మోడల్ ‘లిరియా 3’ (Lyria 3)ను జెమిని యాప్ ద్వారా పరిచయం చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ ఫీచర్‌తో మన అభిరుచికి అనుగుణమైన ఒరిజినల్ పాటను తీర్చిదిద్దుకోవచ్చు.
AI Music Tool | ఏమిటీ లిరియా 3
గూగుల్ డీప్‌మైండ్ రూపొందించిన లేటెస్ట్ జెనరేటివ్ మ్యూజిక్ మోడలే ఈ లిరియా 3.
మూడు ప్రధాన అంశాల్లో మెరుగైన వెసులుబాటులను ఇది అందిస్తోంది.
ఇందులో ప్రత్యేకంగా సాహిత్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఆలోచన, కాన్సెప్ట్ చెబితే చాలు.. జెమిని దానిని స్వీకరించి అద్భుతమైన లిరిక్స్‌ను స్వయంగా రాస్తుంది.
ఆ తర్వాత ఆ పాట ఏ శైలిలో ఉండాలనేది, ఏ గాయకుల గొంతుక కావాలనేది, టెంపో ఎలా ఉంటే బాగుంటుందనే మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు.
అన్నింటిని సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఒకే చెబితే.. నాణ్యమైన సంగీతంతో లిరియా 3 అద్భుతమైన పాటను రూపొందిస్తుంది.