Google Logo | పదేళ్ల తర్వాత లోగో మార్చిన గూగుల్​.. ఎందుకో తెలుసా!
Google Logo | పదేళ్ల తర్వాత లోగో మార్చిన గూగుల్​.. ఎందుకో తెలుసా!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Google Logo | ప్రముఖ టెక్​ దిగ్గజ కంపెనీ గూగుల్ google​ తన లోగోలో స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్న గూగుల్​ G ఆకారంలోని లోగోను 2015 సెప్టెంబర్​ 1 రూపొందించారు. అంతకు ముందు గూగుల్​ ఇంగ్లిష్​ అక్షరాలతోనే ఉండేది. అయితే 2015 ప్రస్తుతం ఉన్న లోగోను విడుదల చేశారు. గతంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులు విడివిడిగా కనిపించేవి. ప్రస్తుతం ఒకదానికొకటి కలిసిపోయినట్లు కనిపించేలా లోగోలో మార్పులు చేశారు. గూగుల్​లో లోగో G అక్షరంలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం రంగుల్లో మాత్రమే మార్పులు చేసింది. కొత్త లోగ్​ చూడటానికి బాగా ఉండటంతో పాటు ఆకర్షించేలా ఉంది.

Google Logo | లోగో ఎప్పుడెప్పుడు మార్చిందంటే..

గూగుల్​ గతంలో కూడా తన లోగోలను మార్చింది. అయితే అప్పుడు గూగుల్​ అక్షరరూపంలో లోగో ఉండేది. అమెరికా చెందిన గూగుల్​ కంపెనీని 1998లో స్థాపించారు. కంపెనీ అనౌన్స్​మెంట్​కు ముందు జిగ్​జాగ్ రూపంలో గూగుల్​ అక్షరాలతో లోగో ఉండేది. కంపెనీ ప్రారంభించిన తర్వాత లోగోలో మార్పులు చేశారు. బాస్కర్‌విల్లె బోల్డ్ టైప్‌ఫేస్‌లో లోగో రూపొందించారు. 1998 మే 30న మరోసారి లోగో మార్చింది. 1999లో కాటల్ టైప్‌ఫేస్ స్టైల్​లో లోగో మార్చారు. ఇది 2015 వరకు అమలులో ఉంది. అనంతరం 2015లో ప్రస్తుతం ఉన్న లోగో తీసుకొచ్చారు. తాజాగా దానిలో కొన్ని మార్పులు చేశారు.

Google Logo | గూగుల్​ డూడుల్స్​ అంటే..

నిత్యం ఉండే గూగుల్​ లోగో స్థానంలో మనకు అప్పుడప్పుడు కొత్త రూపం కనిపిస్తు ఉంటుంది. దీనిని గూగుల్​ డూడుల్స్​ అంటారు. సెలవులు, సంఘటనలు, విజయాలు, చారిత్రక వ్యక్తులను స్మరించుకోవడానికి గూగుల్​ లోగోలో ఆ ఒక్క రోజు మార్పులు చేస్తుంది.