అక్షరటుడే, వెబ్‌డెస్క్: H-1B Visa | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ విదేశీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఎంతో మంది పనిచేస్తుంటారు. వీరు శాశ్వత వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ట్రంప్ తెచ్చిన కఠిన నిబంధనలతో వీసా పొందడం కష్టతరం అయింది. ఈక్రమంలో గూగుల్ తమ ఉద్యోగలకు తమ సంస్థలో పనిచేసే హెచ్-1బీ ) ఉద్యోగులకు ‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియ’ను (Green Card sponsorship process) వేగవంతం చేస్తామని తెలిపింది. అర్హత కలిగిన వారికి 2026లో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు వెల్లడించింది.
H-1B Visa | ఉద్యోగులకు ఊరట
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో భారతీయులు అనేక మంది పనిచేస్తారు. అమెరికాలో పని చేస్తున్న వారికి గూగుల్ నిర్ణయం ఊరట ఇవ్వనుంది. PERMకు అర్హత సాధించిన ఉద్యోగులకు వచ్చే ఏడాది ఇమిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి పిలుపు ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కాగా అమెరికా గ్రీన్ కార్డుల (US Green Card) జారీ ప్రక్రియలో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ (PERM) కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని టెక్ కంపెనీలు అధికంగా వినియోగిస్తాయి. తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తుంటాయి. కాగా ఇటీవల ఉద్యోగులను తొలగించిన గూగుల్ సహా పలు కంపెనీలు PERM దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశాయి. అయితే వచ్చే ఏడాది ఈ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేస్తామని గూగుల్ చెప్పడంతో ఆ సంస్థలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.