Homeఆంధప్రదేశ్Google CEO | ప్ర‌ధాని మోదీకి గూగుల్ సీఈవో ఫోన్‌.. వైజాగ్‌లో పెట్టుబ‌డులపై చ‌ర్చ‌

Google CEO | ప్ర‌ధాని మోదీకి గూగుల్ సీఈవో ఫోన్‌.. వైజాగ్‌లో పెట్టుబ‌డులపై చ‌ర్చ‌

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేశారు. విశాఖప‌ట్నంలో గూగుల్ రూ.88 వేల కోట్ల పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Google CEO | గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖప‌ట్నం(Visakhapatnam)లో గూగుల్ రూ.88 వేల కోట్ల పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించారు. ఇది దేశ అభివృద్ధిలో కీల‌క ప‌రిణామంగా అభివ‌ర్ణించారు.

విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) హబ్‌ను స్థాపించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ మంగళవారం ప్రకటించింది. ఈ నేప‌థ్యంలోనే సుంద‌ర్ ప్ర‌ధాని (PM Modi)కి ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించారు. విశాఖపట్నంలో మొట్టమొదటి గూగుల్ AI హబ్ కోసం కంపెనీ ప్రణాళికలను వివరించిన‌ట్లు పిచాయ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

గూగుల్ నిర్ణ‌యం అభివృద్ధికి కీల‌క మైలురాయిగా నిలుస్తుంద‌ని అభివర్ణించారు. ఈ హబ్ గిగావాట్-స్కేల్ కంప్యూట్ సామర్థ్యం, ​​కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, పెద్ద-స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను మిళితం చేస్తుందని పిచాయ్ వివ‌రించారు. గూగుల్ పెట్టుబడి “భారతదేశంలోని సంస్థలు, వినియోగదారులకు మా పరిశ్రమ-ప్రముఖ సాంకేతికతను తీసుకువస్తుంది, AI ఆవిష్కరణను వేగవంతం చేస్తుంది. దేశవ్యాప్తంగా వృద్ధిని పెంచుతుంది” అని పిచాయ్ పేర్కొన్నారు.

Google CEO | ఏఐ హ‌బ్‌గా విశాఖ‌

ఇండియాలో ఇప్పటివరకు గూగుల్ పెట్టిన పెట్టుబ‌డుల్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి కానుంది. ఈ మేర‌కు న్యూఢిల్లీలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ వెల్ల‌డించారు. త‌మ కంపెనీ నగరంలో 1-గిగావాట్ డేటా సెంటర్ (Data Center) క్యాంపస్‌ను నిర్మిస్తుందని పేర్కొన్నారు. కొత్త AI హబ్ AI మౌలిక సదుపాయాలు, కొత్త డేటా సెంటర్ సామర్థ్యం, ​​పెద్ద ఎత్తున ఇంధన వనరులు, విస్తరించిన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుందని కురియన్ అన్నారు. “ఇది మేము అమెరికా వెలుపల ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టబోతున్న అతిపెద్ద AI హబ్” అని ఆయన అభివ‌ర్ణించారు.

Google CEO | ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడి ప్రభావం

గూగుల్‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మధ్య ఒప్పందం AI సిటీ వైజాగ్ చొరవకు యాంకర్ ప్రాజెక్ట్. కొత్త 1 GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌పై కేంద్రీకృతమై ఉన్న ఈ చొరవలో క్లీన్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, స్థానిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలకు మద్దతునివ్వ‌డంతో పాటు 1.80 లక్షల ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా విశాఖపట్నంను భారతదేశ AI-ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా నిలుపుతుంది.