HomeUncategorizedATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై..! సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200...

ATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై..! సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200 నోట్లే..!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: ATM money : సామాన్యులకు చిన్న నోట్ల అందుబాటును మెరుగుపరిచే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Reserve Bank of India RBI (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOs) తమ ఏటీఎంల ద్వారా రూ.100 , రూ.200 నోట్లు తప్పనిసరిగా విడుదల చేయాలని ఆదేశించింది.

ఆర్బీఐ నిర్ణయం దశలవారీగా అమలవుతుంది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. సెప్టెంబరు 30, 2025 నాటికి దేశంలోని మొత్తం ఏటీఎంలలో ఒక కాసెట్ ద్వారా 75 శాతం రూ.100 , రూ.200 నోట్లు అందుబాటులో ఉంచాలి.

మార్చి 31,2026 నాటికి ఏటీఎంలలో 90 శాతం రూ.100 , రూ.200 నోట్లనే తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు తరచూ అవసరమయ్యే చిన్న నోట్లు సులభంగా లభించేందుకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది.