అక్షరటుడే, వెబ్‌డెస్క్: digipin : ప్రస్తుతం పక్కా లొకేషన్ Genuene Location గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో డిజిపిన్ అన్నింటిని సులభతరం చేస్తోంది.
డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ (Digital Postal Index) నెంబర్ నే డిజిపిన్ అంటారు. ఇది జియో కోడ్, గ్రిడ్ ఆధారిత డిజిటల్ అడ్రస్ వ్యవస్థ. ప్రతి ఇంటికి, భవనానికి ఒక ప్రత్యేక డిజిపిన్ ఉంటుంది. దీని ద్వారా కచ్చితమైన చిరునామా తెలుసుకోవచ్చు. కేంద్ర పోస్టల్ శాఖ (Central Postal Department), పీఎంఓ (PMO) ఈ డిజిటల్ అడ్రస్ ప్రూఫ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad), ఎన్ఆర్ఎస్సీ (NRSC), ఇస్రో (ISRO) సాయంతో దీన్ని డెవలప్ చేశారు.
Digipin : చాలా ఉపయోగాలు..
డిజిటల్ ఇండియా దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఉన్నట్టే ఇకపై ప్రతి ఇంటికి, షాపుకు డిజిటల్ అడ్రస్ సిస్టమ్ (digital address system) అందుబాటులోకి రానుంది. ఆధార్ ఐడెంటిటీ మాదిరిగానే ప్రతి ఇంటికి ప్రత్యేకమైన యూనిక్ డిజిటల్ పిన్ (Digital pin) రాబోతుంది. ఈ కొత్త అడ్రస్ ఆధార్ సిస్టమ్ తీసుకురావాలని కేంద్ర భావిస్తోంది. ఇళ్లతో పాటు స్థలాలను సులభంగా గుర్తించేందుకు లొకేషన్ ఆధారిత డిజిటల్ ఐడీని అందుబాటులోకి తీసుకురానుంది.
భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Digital Public Infrastructure – DPI) ఎకోసిస్టమ్‌లో ఫిజికల్ అడ్రస్ లింక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, భారత్‌లో అడ్రస్ డేటా కోసం ప్రామాణిక వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో వినియోగదారుల ప్రైవసీకి ఇబ్బందికరంగా మారింది. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు తరచుగా వ్యక్తిగత అడ్రస్ వివరాలను సేకరించి, అనుమతి లేకుండా షేర్ చేస్తుంటాయి. ఇకపై అలా కుదరదు.
కొత్త డిజిటల పిన్ (digital PIN) ద్వారా అడ్రస్ వివరాలను వినియోగదారుల అనుమతితో మాత్రమే షేర్ చేయడానికి వీలుంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ (online shopping), కొరియర్ (courier services), ఫుడ్ డెలివరీ(food delivery apps) సంస్థలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన చిరునామా చాలా ముఖ్యం. చాలా మంది చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. దీనివల్ల జీడీపీపై ప్రభావం పడుతోంది. దీన్ని అధిగమించడానికి డిజిపిన్ వ్యవస్థను తీసుకొచ్చారు.