7
అక్షరటుడే, ఇందూరు: Ration Cards | జిల్లాలో మూడునెలల రేషన్కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్‌కార్డు లబ్ధిదారులు ఒకేసారి రేషన్ బియ్యంను పొందవచ్చని సూచించారు. అకాల వర్షాలు, వరదలు, గోదాముల్లో నిల్వ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మూణ్నెళ్ల రేషన్‌ను ఒకేసారి అందజేస్తున్నామన్నారు. అయితే ఎక్కడా అవకతవకలు జరగకుండా పౌరసరఫరాల శాఖాధికారులు (Civil Supplies Department) పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.