అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Highways | ఆర్మూరు – జగిత్యాల-మంచిర్యాల హైవేకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం ఎన్‌హెచ్ NH 63గా ఉన్న ఈ మార్గం రెండు వరుసలుగానే ఉంది. వాహనాల రద్దీ నేపథ్యంలో నాలుగు లేన్లుగా మార్చాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. అయితే వివిధ కారణాలతో అడుగులు ముందుకు పడలేదు. తాజాగా ప్రధానమంత్రి PM office కార్యాలయం సూచన మేరకు ఆ రోడ్డు నిర్మాణానికి వీలుగా అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో త్వరలోనే టెండర్లు tenders పిలిచి పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.
Highways | కీలక రహదారి
ఎన్‌హెచ్ 63 దేశంలోని కీలక జాతీయ రహదారుల్లో national highways ఒకటి. ఇది మహారాష్ట్ర maharashtra లోని దౌండ్ వద్ద మొదలై తెలంగాణ telangana, ఛత్తీస్గఢ్ Chattishgarh మీదుగా 1,065 కి.మీ. కొనసాగి ఒడిశాలోని కోరాపుట్లో ముగుస్తుంది. రాష్ట్రంలో బోధన్-నిజామాబాద్-ఆర్మూరు-మెట్పల్లి-కోరుట్ల- జగిత్యాల-లక్సెట్టిపేట-ధర్మపురి-మంచిర్యాల-చెన్నూరు మీదుగా సాగుతుంది. ఇందులో కొంతభాగం పనులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల ఆధ్వర్యంలో విస్తరిస్తున్నారు. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు.
Highways | బైపాస్‌ల నిర్మాణం
ఆర్మూరు-మంచిర్యాల Armur – Manchiryal రోడ్డు పట్టణాలు, గ్రామాల మీదుగా సాగుతోంది. దీంతో విస్తరణలో ఇబ్బందులు లేకుండా చాలా వరకు బైపాస్‌లను నిర్మించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెద్ద బైపాస్‌లు bypass, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న బైపాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం 105 కిలోమీటర్ల మేర బైపాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే బైపాస్ రోడ్ల నిర్మాణానికి 500 హెక్టార్ల భూమి సేకరించారు. మొత్తం రోడ్డు నిర్మాణానికి రూ.3,850 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.