అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponnam | రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో రూ.93.5 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ (Mahila Bhavan)ను బుధవారం ఆయన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 225 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. దీనిపై పొన్నం మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ఎంతో మంది సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. మహిళా సంఘాల సభ్యుల కోసం తమ ప్రభుత్వం సున్నా వడ్డీకే రుణాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
Minister Ponnam | శిక్షణ ఇచ్చి..
ఉచిత కరెంట్ (Free Current), ఉచిత బస్సు పథకాలతో మహిళలు ఆనందంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో ’అక్క ఆటో’ పేరుతో మహిళలకు శిక్షణ ఇచ్చి, ఉచితంగా ఆటోలు పంపిణీ చేస్తామన్నారు. మహిళలను శక్తివంతం చేయడం, ఉజ్వల భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమన్నారు. మహిళా భవన్లో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఇది మహిళల వృద్ధికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుందని చెప్పారు.