Homeక్రీడలుRohith - Virat | విరాట్, రోహిత్ మళ్లీ మైదానంలోకి.. ఆసీస్ వన్డే సిరీస్ లో...

Rohith – Virat | విరాట్, రోహిత్ మళ్లీ మైదానంలోకి.. ఆసీస్ వన్డే సిరీస్ లో రాణించ‌క‌పోతే..!

రోహిత్, కోహ్లీ ఇద్దరూ 2024 టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత టి20 ఇంటర్నేషనల్స్, టెస్ట్‌ల‌ నుండి, త‌ప్పుకోవ‌డంతో దాదాపు 8 నెలల విరామం తీసుకున్న వీరు, తిరిగి ఫామ్ సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith -Virat | భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Rohit Sharma) మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు.

వరుసగా టెస్ట్, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలాకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు, ఆస్ట్రేలియాతో (Australia) జరగబోయే వన్డే సిరీస్ ద్వారా తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. విరాట్, రోహిత్ ఇద్దరూ ఇటీవల ఫిట్‌నెస్ టెస్టులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియ‌జేశారు. అజిత్ అగార్కర్ (Ajith Agarker) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అక్టోబర్ 4న అధికారికంగా వన్డే, టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది.

Rohith – Virat | 8 నెలల తర్వాత

వన్డే ఫార్మాట్‌కి (ODI Format) ఇద్దరు ఎంపిక కావడం ఆనందానికి గురి చేసింది. చివరిసారిగా వీరిద్దరూ 2025 మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి అఖిల భారత స్థాయిలో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగబోతుండడంతో అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohi) ఇద్దరూ ఇప్పటికే T20I ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు.2024 వరల్డ్ కప్ గెలవడమే ఈ నిర్ణయానికి కారణమైంది.అంతేకాదు, ఈ ఏడాది మేలో టెస్ట్ క్రికెట్‌కు కూడా వీళ్లు గుడ్‌బై చెప్పారు. తదుపరి టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సిన సందర్భంలోనే ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. అయితే ఈ సిరీస్ నుండి రోహిత్ కెప్టెన్‌గా కాకుండా కేవ‌లం ఆటగాడిగా మాత్ర‌మే కొన‌స‌గ‌నున్నాడు.

Rohith -Virat | ఆసీస్ టూర్ షెడ్యూల్ చూస్తే..

  • మొద‌టి వన్డే – అక్టోబర్ 19 – పెర్త్
  • రెండో వన్డే – అక్టోబర్ 23 – అడిలైడ్
  • మూడో వన్డే – అక్టోబర్ 25 – సిడ్నీ
  • వెంటనే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది (అక్టోబర్ 29 – నవంబర్ 8)

Rohith -Virat | 2027 వరల్డ్ కప్ టార్గెట్ ?

విరాట్, రోహిత్‌ లాంటి సీనియర్ ఆటగాళ్ల తిరిగి వన్డేల్లో కనిపించడాన్ని బట్టి చూస్తే, 2027 వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) వరకు వీరు తమ సేవలు అందించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. తాజా ఆసీస్ టూర్ ఈ దిశగా వారికి తొలి అడుగుగా మారబోతున్నది. మరి ఈ టూర్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.