HomeUncategorizedBank Jobs | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. టెన్త్ పాస్ అయితే చాలు.. బ్యాంక్‌ జాబ్‌

Bank Jobs | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. టెన్త్ పాస్ అయితే చాలు.. బ్యాంక్‌ జాబ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bank Jobs | నిరుద్యోగుల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (Bank of Baroda) మంచి గోల్డెన్ చాన్స్ అందిస్తోంది. ప‌దో తరగతి పాసైన వారికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది. బ్యాంకు ఆఫ్ బరోడా(Bank of Baroda Jobs Notification) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేష‌న్ల‌కు చివరి తేదీ మే 23, 2025.

Bank Jobs | 500 ఉద్యోగాలు..

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 500కు పైగా ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్(Bank Job Notification) జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 500 ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. జనరల్ కేటగిరీలో 252 పోస్టులు ఉండ‌గా, ఓబీసీల‌కు 108, ఈడ‌బ్ల్యూఎస్ వారికి 42, ఎస్సీల‌కు 65, ఎస్టీల‌కు 33 పోస్టులు రిజ‌ర్వ్ చేసింది. 18-26 సంవత్సరాల మధ్య అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Bank Jobs | టెన్త్ పాసైతే చాలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి (SSC/మెట్రిక్యులేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత భాష చదవడం, రాయడం, మాట్లాడటం తప్పక వచ్చి ఉండాలి. జనరల్, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌లు త‌దిత‌ర అభ్య‌ర్థులు రూ.100 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసువోవ‌చ్చు.

Bank Jobs | రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక‌..

అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనే www.bankofbaroda.inలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫాం(Application Form) ఫిల్ చేశాక అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి, తర్వాత ఫీజు చెల్లించాలి. చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 80 నిమిషాలు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్ (రీజనింగ్). ప్రతి విభాగంలో 25 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పు సమాధానాలకు పావు శాతం మార్కులు కట్ చేస్తారు. రిటెన్ టెస్ట్ అనంత‌రం అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.