అక్షరటుడే, న్యూఢిల్లీ: Tunnel railway line : దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగ (longest railway tunnel ) మార్గం ఉత్తరాఖండ్‌లో విజయవంతంగా పూర్తి అయింది. భారతదేశం రైల్వే మౌలిక సదుపాయాల(railway infrastructure) అభివృద్ధిలో ఇది ఒక గొప్ప ముందడుగు. 14.6 కి.మీ.ల పొడవుతో ఉన్న ఈ ఇంజినీరింగ్ అద్భుతం(engineering marvel ) టన్నెల్ T-8 (Tunnel T-8) ప్రతిష్ఠాత్మకమైన రిషికేశ్ – కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు( Rishikesh – Karnaprayag rail project)లో ఒక కీలకమైన భాగం.
ఉత్తరాఖండ్(Uttarakhand )లోని దేవ్‌ప్రయాగ్ – జనసు మధ్య 14.6 కిలోమీటర్ల రైల్వే సొరంగాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) విజయవంతంగా పూర్తి చేసింది.
భారతదేశంలోనే అతి పొడవైన రవాణా రైల్వే సొరంగం ఇది. దీని నిర్మాణంతో ఎల్ అండ్ టీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో చేపట్టిన 125 కిలోమీటర్ల రిషికేశ్ – కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయినట్లుగా చెప్పొచ్చు.
Tunnel railway line : అత్యాధునిక టెక్నాలజీ..
అత్యాధునిక సింగిల్-షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) tunnel boring machine (TBM) సహాయంతో దీని తవ్వకం చేపట్టారు. 9.11 మీటర్ల వ్యాసంతో హిమాలయ ప్రాంతంలో అతిపెద్ద టీబీఎంగా ఇది నిలుస్తుంది. నెలకు సగటున 413 మీటర్ల వేగంతో తవ్వకం కొనసాగించారు. 10.4 కిలోమీటర్ల సొరంగ భాగం టీబీఎం ద్వారా చేపట్టారు. మిగతా 4.11 కిలోమీటర్లు న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం) New Austrian Tunneling Method (NATM) తో నిర్మించారు.
Tunnel railway line : ఐదు గంటలు సేవ్..
ఈ సొరంగం ఏర్పాటుతో చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra) ప్రయాణ సమయం 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గనుంది. ఎల్‌అండ్‌టీ ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 2, ప్యాకేజీ 4 చేపడుతోంది. ప్యాకేజీ 4లో, ఎల్‌అండ్‌టీ 14.5 కిలోమీటర్ల అప్‌లైన్, 13.1 కిలోమీటర్ల డౌన్‌లైన్‌తో దేశంలోనే అతిపొడవైన రైల్వే సొరంగం ఉంది. ప్యాకేజీ 2లో 26.6 కిలోమీటర్ల సొరంగ తవ్వకం, 28 కిలోమీటర్ల సొరంగ లైనింగ్, రెండు రైల్వే వంతెనలు, ఒక రోడ్డు వారధి, కట్టడాల నిర్మాణం ఉన్నాయి.