అక్షరటుడే, వెబ్డెస్క్: RTC Jobs | రాష్ట్రంలోని నిరుద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) గుడ్న్యూస్ చెప్పారు. డిసెంబర్లో మరో జాబ్ నోటిఫికేషన్ (job notification) విడుదల చేసి పలు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
ఆర్టీసీ ఇటీవల 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిషికేషన్ జారీ చేసిన చేసింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ దశలో ఉందని ఈ నియామకాలు వేగంగా పారదర్శకంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (traffic supervisor trainees), 114 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు (TGPSC or Police Board) ద్వారా నియామక ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు.
RTC Jobs | ఆదాయంపై దృష్టి పెట్టాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆర్టీసీ అధికారులతో (RTC officials) సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయంతో (Mahalaxmi ticket income) పాటు అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సూచించారు. ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని చెప్పారు. దీనికి సంబందించి ప్రభుత్వం రూ.7,980 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. టికెట్ యేతర ఆదాయంపై సైతం ఫోకస్ చేయాలన్నారు. నష్టాల్లో డిపోలను లాభాల బాటలోకి తీసుకు రావాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad city) పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
RTC Jobs | కొత్తగా బస్టాండ్ల నిర్మాణం
నగరంలో కొత్తగా బస్ టెర్మినళ్ల నిర్మాణం కోసం అధికారులు అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. జేబీఎస్ మాదిరి ఆరంఘర్, ఉప్పల్లో (Aranghar and Uppal) బస్ టెర్మినల్ నిర్మించడానికి అధ్యయనం చేయాలన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. డ్రైవర్లకు మెడికల్ టెస్ట్ నిర్వహించాలన్నారు.
RTC Jobs | మేడారం జాతరకు 3,800 బస్సులు
మేడారం జాతర (Medaram Jatara) సమీపిస్తుండటంతో బస్టాండ్ నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. మహా జాతరకు 3,800 బస్సులు నడుపుతామన్నారు. గత ఏడాది జాతర కోసం 3,490 బస్సులు నడిపితే.. 16.83 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు.
