అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Study Circle | ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం (government job) సాధించడానికి ప్రిపేర్ అవుతున్నారు. పోటీ పరీక్షల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో (private coaching centers) రూ.వేల ఫీజులు చెల్లించి ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నారు. అయితే పేద నిరుద్యోగులు మాత్రం డబ్బులు కట్టే స్థోమత లేక సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బీసీ స్టడి సర్కిల్ (BC Study Circle) ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామని పేర్కొంది.
హైదరాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ జాబ్‌ల కోసం ఉచితంగా కోచింగ్ ఇస్తామని డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 25 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాల్లో 150 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. దీనికోసం అభ్యర్థులు జూలై 16 నుంచి ఆగస్టు 11లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
BC Study Circle | వీరు అర్హులు..
ఏదైనా డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆదాయం రూ. 1.50 లక్షలు (గ్రామీణ) రూ.2 లక్షలు (పట్టణ) కంటే తక్కువ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఐదు నెలల పాటు నెలకు రూ. వేయి చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు. మరిన్ని వివరాల కోసం 040-24071178 నంబర్‌ను సంప్రదించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.