అక్షరటుడే, ఇందూరు: Double bedroom houses | జిల్లాలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. దీనికి సంబంధించి అర్హులకు కేటాయింపు ప్రక్రియ శరవేగంగా చేపడుతున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. కలెక్టరేట్‌కు (Collectorate nizamabad) ఆనుకుని ఉన్న ఇళ్లను గురువారం అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐడీవోసీ(IDOC) పక్కన, నాగారం (nagaram) ప్రాంతాల్లో 900 డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి, ఆమోదం కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి జాబితా పంపుతున్నట్లు తెలిపారు.
Double bedroom houses | ఇళ్లు లేని వారికి.. నిరుపేదలకు..
ప్రధానంగా ఇల్లు లేని వారికి, నిరుపేద కుటుంబాలకు, సఫాయి కర్మచారి, వితంతువులు, ఒంటరి మహిళలకు కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఇళ్ల సముదాయాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతుల కల్పనకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, రోడ్లు భవనాల శాఖ డీఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లు