HomeతెలంగాణBest Teachers | ఉపాధ్యాయులకు గుడ్​న్యూస్​.. విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లనున్న ప్రభుత్వం

Best Teachers | ఉపాధ్యాయులకు గుడ్​న్యూస్​.. విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లనున్న ప్రభుత్వం

Best Teachers | రాష్ట్ర విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులను విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లనుంది. ఒక్కో బ్యాచ్​లో 40 మంది చొప్పున మొత్తం 160 మందికి అవకాశం కల్పించనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Best Teachers | రాష్ట్ర విద్యాశాఖ (Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశీ పర్యటన (Foreign trip)కు తీసుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం విదేశీ పర్యటన అవకాశం కల్పించింది. సింగపూర్‌, ఫిన్లాండ్‌, వియత్నాం, జపాన్‌ దేశాల్లో టీచర్లు పర్యటించనున్నారు. ఈ నెల 23లోపు ఉత్తమ టీచర్ల జాబితా పంపించాలని కలెక్టర్లకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 5 రోజుల విదేశీ పర్యటన ఉండనుంది. ఒక్కో బ్యాచ్​లో 40 మంది చొప్పున నాలుగు బ్యాచుల్లో 160 మందిని టూర్లకు తీసుకు వెళ్లనున్నారు.

Best Teachers | సామర్థ్యాల పెంపు కోసం..

ఉపాధ్యాయుల వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించడానికి, వారికి ప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడానికి విదేశాలకు తీసుకు వెళ్లాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యా మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు పాఠశాల విద్యలో ఆయా దేశాలు అనుసరిస్తున్న వివిధ ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటారు.

Best Teachers | ఎంపిక ఇలా..

విదేశీ పర్యటన కోసం ప్రతి జిల్లా నుంచి జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు లేదా TREIS సంస్థల నుంచి ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది. నామినేషన్లలో SGT/LP/PET/TGT లేదా తత్సమాన కేడర్ నుంచి ఒక్కో ఉపాధ్యాయుడు, SA/PGTలలో ఒకరు, ఒక ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ ఉండాలి. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చిన నామినేషన్ల ఆధారంగా రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ తుది జాబితాను ఖరారు చేస్తుంది.