అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Holidays | రాష్ట్రంలోని విద్యార్థులకు అదిరిపోయే వార్త. మూడు రోజుల పాటు వరుస సెలవులు వచ్చాయి. ఈ నెల 15న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా పాఠశాలలు మధ్యాహ్నం వరకే ఉంటాయి. 16న శనివారం కృష్ణాష్టమి (Krishnastami) కావడంతో సెలవు ఉంది. వీకెండ్లో వరుసుగా మూడు రోజులు హాలీడేస్ రావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో గత వారం కూడా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం సందర్భంగా మూడు రోజులు పాఠశాలలు లేవు. దీంతో పిల్లలతో రాఖీ పండుగకు మహిళలు పుట్టింటికి వెళ్లి వచ్చారు. తాజాగా మరోసారి మూడు రోజులు సెలవు రావడంతో విద్యార్థులు ఆనంద పడుతున్నారు.
Holidays | పిల్లలతో జాగ్రత్త..
ప్రస్తుతం చెరువులు, జలాశయాలు (Projects) నిండుకుండలా మారాయి. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పలువురు పిల్లలతో ప్రాజెక్టులను చూడాటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జలాశయాల దగ్గరకు వెళ్లిన సమయంలో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెరువులు, కాల్వల్లో స్నానం చేయకుండా చూడాలని.. నీటి సమీపంలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Holidays | సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబురమే..
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు (Software Employees) ప్రతి శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. ఆగస్టు 15న పబ్లిక్ హాలీడే కావడంతో ఈ సారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో వారు కూడా మిత్రులు, సహోద్యోగులతో ట్రిప్‌లకు ప్లాన్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో గేట్లు ఎత్తిన డ్యామ్‌లు, జలపాతాల సందర్శనకు వెళ్లాలని యోచిస్తున్నారు.
Holidays | బ్యాంకులకు కూడా..
రాష్ట్రంలో బ్యాంకులకు కూడా మూడు రోజులు సెలవు ఉండనుంది. శుక్ర, శని, ఆదివారాల్లో బ్యాంకులు బంద్ (Bank Holidays) ఉంటాయి. ఖాతాదారులు ఈ మేరకు లావాదేవీలు చేపట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.