అక్షరటుడే, వెబ్డెస్క్ : Dost | తెలంగాణ telangana ప్రభుత్వం ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ notification విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన శుక్రవారం డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్స్(Dost) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
Dost | మూడు విడతల్లో ప్రవేశాలు
దోస్త్(Dost) ప్రక్రియలో భాగంగా ఈసారి మూడు విడతల్లో three phases అడ్మిషన్లు చేపట్టనున్నారు. మొదటి దశ first phase అడ్మిషన్ల కోసం ఈ నెల 3 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి 22 వెబ్ ఆప్షన్లు(Web options) పెట్టుకోవచ్చు. మొదటి దశ సీట్లను మే 29న కేటాయిస్తారు. మొదటి సెమిస్టర్(First semester) తరగతులు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి.
Dost | మొత్తం 4,67,456 సీట్లు
రాష్ట్రంలో మొత్తం 1,057 డిగ్రీ కళాశాలలు(Degree colleges) ఉండగా, వీటిలో 987 కళాశాలలు దోస్త్(Dost) పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ వర్గీకరణ మేరకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.