ePaper
More
    Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. టీటీడీ కీలక నిర్ణయం

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. టీటీడీ కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల(tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా విదేశాల నుంచి సైతం భారీగా భక్తులు తరలి వస్తారు. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ(TTD) అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అంతేగాకుండా భక్తులకు శ్రీవారి సేవ చేయడానికి అవకాశం ఇస్తోంది. దీంతో ఎంతో మంది భక్తులు స్వామి వారి సేవలో తరిస్తుంటారు. అయితే ఈ సౌకర్యం దేశంలోని భక్తులకు మాత్రమే ఉంది. తాజాగా టీటీడీ ఎన్నారై భక్తులకు సైతం స్వామి సేవలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

    ఎన్నారై(NRI’s)లు కూడా శ్రీవారి సేవ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala rao) తెలిపారు. గోమాత సేవ చేసేందుకు కొత్తగా ‘గో సేవ’ను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో టీటీడీ అధికారులు వర్చువల్​గా సమావేశం నిర్వహించారు. మెడిసిన్, ఐటీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో సేవలందించేందుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారని ఈవో తెలిపారు. వారి సేవలను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...