Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక చర్యలు చేపడుతోంది. భక్తుల రద్దీ మేరకు వసతులు కల్పించడంతో పలు నిర్ణయాలు సైతం తీసుకుంటుంది. ఇందులో భాగంగా శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Darshan Tickets) కోటాను పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రస్తుతం శ్రీవాణి దర్శన కోటా కింద నిత్యం 1500 టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీటిని రెండు వేలకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిత్యం ఆన్​లైన్​లో శ్రీవాణి దర్శన కోటా 500 టికెట్లు, ఆఫ్​లైన్​లో వెయ్యి టికెట్లు ఇస్తున్నారు. ఆఫ్​లైన్​లో ఈ టికెట్లకు డిమాండ్​ ఉంది. దీంతో మరో 500 టికెట్లను అదనంగా ఇవ్వడానికి టీటీడీ (TTD) కసరత్తు చేస్తోంంది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రస్తుతం 200 టికెట్లు ఇస్తున్నారు. వాటిని 400కు పెంచనున్నారు. అలాగే తిరుమలలో (Tirumala) ఇస్తున్న 800 టికెట్లను 1100 పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పూర్తి కసరత్తు చేసిన తర్వాత దీనిపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Tirumala | విరాళం ఇచ్చే భక్తులకు..

తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్​కు​ (Srivani Trust) విరాళం ఇచ్చే దాతలకు ఈ టికెట్లు ఇస్తారు. రూ.10 వేలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే వారికి శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. ఈ టికెట్లు ఉన్న భక్తులు క్యూలైన్​లో వేచి ఉండకుండా వీఐపీ దర్శనం (VIP Darshan) చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే శ్రీవాణి దర్శన వేళల్లో టీటీడీ మార్పులు చేసింది. గతంలో ఉదయం పూట మాత్రమే శ్రీవాణి టికెట్లు ఉన్న వారికి దర్శనం కల్పించేవారు. ప్రస్తుతం టికెట్​ పొందిన రోజే సాయంత్రం దర్శనం కల్పిస్తున్నారు. దీంతో గదుల రద్దీ తగ్గింది. అంతేగాకుండా శ్రీవాణి టికెట్ల జారీ కోసం కొత్త కౌంటర్​ను సైతం టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. రూ.60 లక్షల వ్యయంతో అన్నమయ్య భవనం ఎదురుగా శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్​ను ప్రారంభించారు.