ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. 8 ప్రత్యేక రైళ్లు

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. 8 ప్రత్యేక రైళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఎక్కువ శాతం భక్తులు రైలు మార్గంలోనే తిరుపతి చేరుకుంటారు. దీంతో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వ్​ అయిపోతాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ చెప్పింది. కరీంనగర్​ నుంచి తిరుపతికి (Karimnagar to Tirupati) ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.

    తిరుపతి నుంచి కరీంనగర్​కు జూలై 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు (Special Train) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం నాలుగు సర్వీసులు నడుపుతామని తెలిపింది. అలాగే కరీంనగర్​ నుంచి తిరుపతికి జూలై 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం ఒక రైలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ రైళ్లు పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...