ePaper
More
    HomeతెలంగాణTGS RTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. బస్సుల్లో డిజిటల్​ పేమెంట్స్​కు శ్రీకారం

    TGS RTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. బస్సుల్లో డిజిటల్​ పేమెంట్స్​కు శ్రీకారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGS RTC | తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్​ పేమెంట్​ పద్ధతిని(Digital Payment Method) తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)​ తెలిపారు. డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకురాబోతున్నామని చెప్పారు.

    TGS RTC | హైదరాబాద్​ నగరంలో ఇప్పటికే అమలు

    హైదరాబాద్(Hyderabad)​ నగరంలో ఇప్పటికే ఈ పద్ధతిని అమలు చేస్తున్నామని పొన్నం తెలిపారు. గత మూడు నెలలుగా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 16 నుంచి 20 శాతం వరకు డిజిటల్​ పద్ధతిలో పేపెంట్స్​ జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

    TGS RTC | అంతా ఆన్​లైన్​లోనే..

    రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బస్సుల్లో ఆరు వేల బస్సుల్లో అమలు చేస్తామని పొన్నం తెలిపారు. ఇందులో భాగంగా డిజిటల్​ మెషిన్లను(Digital Machines) ఉపయోగించనున్నట్లు తెలిపారు. వీటిని హెడ్​ క్వార్టర్స్​(Headquarters)కు అటాచ్​ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు. ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారనే విషయం తెలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఆదాయం ఎంత వస్తుందనేది కూడా ఎప్పటికప్పడు తెలుస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల అకౌంటబులిటీ కూడా పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...