అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana RTC | తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్తగా 2800 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhaka) తెలిపారు. శాసన సభ సమావేశాల్లో (Legislative Assembly sessions) భాగంగా ఆయన మంగళవారం మాట్లాడారు. ఆర్టీసీలో ఇప్పటికే 575 ఈవీ బస్సులు ఉండగా.. మరో 2800 బస్సులు పీఎం ఈ డ్రైవ్ (PM e-Drive scheme) కింద రానున్నాయని తెలిపారు. అంతేకాకుండా వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి (Nizamabad Municipality) 50 బస్సులు కేంద్ర ప్రభుత్వ పథకం కింద రానున్నాయని చెప్పారు.
Telangana RTC | పెరిగిన ఈవీ వాహనాల కొనుగోళ్లు
రాష్ట్రంలో ఈవీ వాహనాల (EV vehicles) కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకురావడంతో అమ్మకాలు బాగా పెరిగాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతాలు కాలుష్యంతో ఎంత ఇబ్బంది పడుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సైతం ఈవీ వాహనాలు 25 శాతం నుంచి 50 శాతం వరకు వాహనాలు కొనుగోలు చేయాలనే చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 20 శాతం సబ్సిడీ ఇవ్వాలనే అంశం ప్రభుత్వంలో చర్చ కొనసాగుతోందని చెప్పారు. పాఠశాలలు, ఫార్మా ఐటీ తదితర ఎంఎన్సీ కంపెనీలు 25 శాతం 50 శాతం బస్సులు కొనుగోలు చేసేలా విధానం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Telangana RTC | విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో విస్తృతంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పొన్నం తెలిపారు. ప్రస్తుతం మంచి మైలేజీ వచ్చే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. టూరిస్టు ప్రాంతాలు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కలెక్టరేట్లు, ప్రైవేటుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Telangana RTC | 15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు స్క్రాప్ పాలసీ
15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు స్క్రాప్ కిందకు మారిస్తే ప్రభుత్వం తరపున ఇన్సెంటీవ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Telangana RTC | ఆర్టీసీలో రెట్రోఫిట్
ఆర్టీసీలో రెట్రోఫిట్ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పాత బస్సులు డీజిల్ ఇంజన్లను తొలగించి ఈవీ పద్ధతిలోకి మార్చేందుకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లో ఆటోల్లోనూ రెట్రోఫిట్ విధానం అమలులోకి తేవాలని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.