అక్షరటుడే, వెబ్డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ పున:ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ(RCB) అభిమానులకు గుడ్ న్యూస్. ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని భావించిన వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్(Romario Shepherd) భారత్‌కు తిరిగి వస్తున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 శనివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పాక్(Pakistan)తో ఉద్రిక్తతలతో స్వదేశానికి వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లలో కొంత మంది భారత్(Bharath)కు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు, జాతీయ జట్టు మ్యాచ్‌లు, గాయాలతో రావడం లేదు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ రావడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ షెపర్డ్.. భారత్‌కు పయనమయ్యాడని రస్సెల్ తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులో చేరేందుకు సిద్దమయ్యాడని తెలుస్తోంది.