ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bhadrachalam Darshan | రాములోరి భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలం ఆలయంలో డిజిటల్ సేవలు

    Bhadrachalam Darshan | రాములోరి భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలం ఆలయంలో డిజిటల్ సేవలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Darshan | భద్రాచలంలో (Bhadrachalam) కొలువైన రాములోరి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. శ్రీరామనవమి పర్వదినాన స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి లక్షల మంది తరలి వస్తారు. జగదబిరాముడి దర్శనంతో ఎంతో మంది తరిస్తారు.

    శ్రీరాముడి(Lord Sri Rama) దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం దర్శనం, ప్రసాదం, అర్చనలు తదితర కార్యకలాపాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఫెడరల్ బ్యాంక్ సౌజన్యంతో కియోస్క్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో వేగవంతంగా స్వామివారి సేవలను పొందవచ్చని ఈవో తెలిపారు.

    భక్తులు డిజిటల్​ సేవలు(Digital Services) పొందేందుకు ఏర్పాటు చేసిన కియోస్క్​(Kiosk)ను ఆలయ ఈవో రమాదేవి(Temple EO Ramadevi) శనివారం ప్రారంభించారు. దీని ద్వారా దర్శనం, అర్చన, ప్రసాదం టికెట్లు తీసుకోవచ్చు. అంతేగాకుండా విరాళాలు కూడా సమర్పించవచ్చు. దీంతో వేగంగా స్వామి వారి సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. భక్తుల సమయం ఆదా అవుతుందని చెప్పారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...